
ముంపునకు గురైన జాతీయ రహదారి
● తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మధ్య
నిలిచిన రాకపోకలు
వాజేడు: మండలపరిధిలోని టేకులగూడెం గ్రామసమీపంలో 163 నంబర్ జాతీయ రహదారిపైకి శుక్రవారం గోదావరి వరద నీరు చేరింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద క్రమేపి పెరుగుతుండడంతో రేగుమాకు ఒర్రె నుంచి రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. అప్రమత్తమైన అధికారులు వరదలోకి ఎవరూ వెళ్లకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వరద పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముంపునకు గురైన జాతీయ రహదారిని పేరూరు ఎస్సై కృష్ణప్రసాద్, ఎంపీడీఓ శ్రీకాంత్‌నాయుడు పరిశీలించారు. వాహనదారులు నీటిలో నుంచి వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు.