
గిరిజన దర్బార్‌లో వినతులు ఇలా..
వెంకటాపురం(కె) మండల పరిధిలోని పాత్రాపురం గ్రామానికి చెందిన ఓ గిరిజన వ్యక్తి తమ కుటుంబసభ్యుల మరణ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలని కోరారు. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన రవి మేడారంలో ఆదివాసీ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి చేయించాలని విన్నవించారు. ఏటూరునాగారం మండల పరిధిలోని చెల్పాక గ్రామానికి చెందిన గిరిజనుడు ఆర్థిక సాయం ఇప్పించాలని కోరారు. మంగపేట మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన గిరిజనుడు ఐటీఐ అప్రెంటిస్ పూర్తి చేశానని అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం ఇప్పించాలని విన్నవించాడు. గోవిందరావుపేట మండలం పస్రాకు చెందిన ఓ గిరిజనుడు అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం కల్పించాలని కోరారు. ములుగు మండలం అంకన్నగూడేనికి చెందిన గిరిజనుడు సౌర గిరిజల వికాసం పథకం మంజూరు చేయాలని కోరారు. ఇలా పలువురు తమ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీఓ వసంతరావుకు వినతులు అందజేశారు. దరఖాస్తులను పరిశీలించి పీఓ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏపీఓ వసంతరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ సురేష్‌బాబు, మేనేజర్ శ్రీనివాస్, డీటీ అనిల్, డిప్యూ టీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్, హెల్త్ ప్రోగ్రాం ఆఫీసర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.