
ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి
మాది నిరుపేద కుటుంబం. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా వెన్నుముక దెబ్బతిని మంచానికి పరమితమయ్యాను. తల్లితో పాటు నివసించేందుకు ఇల్లు లేదు. గతంలో కలెక్టర్ చిన్న రేకుల షెడ్డు ఏర్పాటు చేయించి ఇవ్వగా అది పూర్తిగా ధ్వంసమైంది. కలెక్టర్ స్పందించి ఇందిరమ్మ ఇల్లు కేటాయించి ఆదుకోవాలి.
– జల్లెల్ల రమేష్,
మొద్దులగూడెం, గోవిందరావుపేట మండలం
మల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి నివాస స్థలం వా రసత్వంగా వచ్చింది. ఈ స్థలా న్ని నా భార్య పేరున రిజిస్ట్రేషన్ చేశాను. ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే పంచాయతీ కార్యదర్శి అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, సంబ ంధిత పత్రాలను పరిశీలించి అనుమతి ఇప్పించాలి.
– చిరువంచ రమేష్, మల్లంపల్లి
భూ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం లేకుండా పో యింది. వారసత్వంగా వచ్చి న భూమికి కొందరు అడ్డుతగిలి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి వారంలో సమస్య పరిష్కా రం కాకుంటే మళ్లీ ఫిర్యాదు చేయమంటే చేశారు.
– బోట చిన్ననర్సయ్య,
వెంకటాపురం(కె)

ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి