
ఎయిడ్స్‌పై అవగాహన తప్పనిసరి
ములుగు రూరల్: ఎయిడ్స్‌పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు సోమవారం మండల పరిధిలోని జాకారం సాంఘీక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(దిశా) ఆధ్వర్యంలో చేపట్టిన 5కె మారథన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. విద్యార్థులకు ఎయిడ్స్‌పై క్విజ్ కాంపిటీషన్ ఏర్పాటు చేసి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు