జేఈఈ మెయిన్స్‌లో జగదీశ్వరి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్స్‌లో జగదీశ్వరి ప్రతిభ

Aug 26 2025 8:10 AM | Updated on Aug 29 2025 10:51 AM

కన్నాయిగూడెం: పేదింటి బిడ్డ జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపి హర్యానాలోని సెంట్రల్‌ యూనివర్సిటీలో సీటు సాధించింది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని బుట్టాయిగూడెం గ్రామంలో కుమ్మరి ప్రమీలతిరుపతి దంపతుల కూతురు జగదీశ్వరి ఇటీవల వెలువడిన జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ర్యాంకు సాధించింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి సేల్స్‌ డీలర్‌ షాపు నడుపుతూ కూతురును కష్టపడి చదివించింది. తల్లి కష్టం చూసిన జగదీశ్వరి ప్రణాళికతో చదివి జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ చూపి హర్యానాలోని సెంట్రల్‌ యూనివర్సిటీలో చేరింది. పేదరికం చదువుకు అడ్డుకాదని నిరూపించింది.

పోడు భూములకు పట్టాలివ్వాలి

ములుగు రూరల్‌: పోడు సాగు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీ గిరిజనులకు పోడు పట్టాలు అందించాలని ఎంసీపీఐ(యూ) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సాంబయ్య అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట, కలెక్టరేట్‌లో బాలన్నగూడెం గ్రామంలో పోడు సాగు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న వారికి పట్టాలు అందించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి పోడు జీవనం కొనసాగిస్తున్న గిరిజనులకు పట్టాలు అందించి ఆదుకోవాలని అన్నారు.

జీఐఏ సాధన సమితి ప్రధాన కార్యదర్శిగా గణేశ్‌

మంగపేట: అర్చక ఉద్యోగుల మలిదశ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌(జీఐఏ) సాధన సమితి ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గొర్లపల్లి గణేశ్‌ను ఎన్నుకున్నట్లు సంఘం నాయకులు దురిశెట్టి విద్యాసాగర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లోని బోలక్‌పూర్‌ భవాని శంకర దేవాలయంలో రాష్ట్రంలోని దేవస్థానంలో నిర్వహించిన అర్చక, ఉద్యోగుల సమావేశంలో అర్చక ఉద్యోగుల మలిదశ (జీఐఏ) సాధన సమితి నూతన సంఘాన్ని ఏర్పాటు చేసి కమిటీని ఎన్నుకున్నట్లు వివరించారు. కమిటీ ప్రధాన కార్యదర్శిగా నర్సింహస్వామి, ఆలయంలో పనిచేస్తున్న గణేశ్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

చెక్‌ బౌన్స్‌ కేసులో జరిమానా 

ములుగు రూరల్‌: జిల్లా కోర్టులో 2022లో నమోదైన చెక్‌ బౌన్స్‌ కేసులో సోమవారం జిల్లా జూనియర్‌ సివిల్‌ కోర్టులో తీర్పు వెలుబడింది. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని అబ్బాపూర్‌కు చెందిన గాదె శంకర్‌ 2022లో జాకారం గ్రామానికి చెందిన గండ్రత్‌ శ్రీనివాస్‌పై చెక్‌ బౌన్స్‌ కేసు వేశారు. బాధితుడి వైపు న్యాయవాది సునీల్‌ కోర్టులో సమర్పించిన ఆధారాలను పరిశీలించి గండ్రత్‌ శ్రీనివాస్‌పై రూ. 8 లక్షలు, కోర్టు జరిమానా రూ. 10 వేలు చెల్లించాలని తీర్పు వెలువరించారు. ఈ తీర్పును దిక్కరిస్తే నెల రోజుల పాటు జైలు ఉంటుందని జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి గుంటి జోత్స్న తెలిపారు.

నియామక ఉత్తర్వులు

కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం అర్చకులుగా ఎంపికై న సంగనభట్ల విజయ్‌కుమార్‌, రావుల రాజకుమార్‌, త్రిపురారి శ్రావణ్‌కుమార్‌, కాకిరాల పవన్‌శర్మలకు ప్రధానార్చకులు పనకంటి ఫణీంద్రశర్మతో కలిసి ఆలయ ఈఓ మహేష్‌ సోమవారం నియామక పత్రాలను అందించారు. మరో అర్చకుడు కశ్యప్‌శర్మపై పలు అబియోగాలు రావడంతో ప్రభుత్వ పరిశీలనకు పంపినట్లు తెలిపారు. సోమవారం నలుగురు విధుల్లో చేరినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement