
ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
వెంకటాపురం(ఎం): గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. విద్యుత్, మున్సిపల్, పంచాయతీ, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ జిల్లా కేంద్రంతో పాటు ఏటూరునాగారంలోని ముళ్లకట్ట, రామన్నగూడెం, మంగపేట మండలాల్లో లోలెవెల్‌లో ఉన్న విద్యుత్ తీగలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనానికి వెళ్లే రూట్లలో విద్యుత్ తీగల విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రూట్ క్లియరెన్స్ సమర్పించాలన్నారు. మెడికల్ కోసం లైటింగ్, శానిటేషన్, బ్లీచింగ్ వంటి పనులను మున్సిపల్, పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో పక్కాగా చేపట్టాలన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో వైద్యాధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఆనంతరం ఎస్పీ శబరీశ్ మాట్లాడుతూ ఈసారి గణేశ్ విగ్రహాల నిర్వాహకులు పోలీస్ వెబ్‌సైట్‌లో గణేశ్ మండపంతో పాటు తమ పూర్తి వివరాలు నమోదు చేయాలని, తద్వారా వారికి తగిన సేవలు అందుతాయని తెలిపారు. నిమజ్జన ప్రాంతాలైన చెరువుల వద్ద పోలీసుశాఖ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు, ప్రత్యేకంగా రాత్రి సమయాల్లో మండపాల నిర్వాహకులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్.మహేందర్ జీ, సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల అభివృద్ధికి కృషి
అనంతరం నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం వికాసత్ భారత్ కార్యక్రమంలో గిరిజనులను అభివృద్ధికి కృషి చేయనున్నట్లు వెల్ల డించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదికర్మ యోగి కార్యక్రమాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి బుక్‌లెట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదికర్మ యోగి కార్యక్రమాల ద్వారా 7 శాఖల నుంచి అధికారులను రాష్ట్రస్థాయి శిక్షణకు పంపించినట్లు తెలిపారు.
కలెక్టర్ టీఎస్.దివాకర

ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి