
వైద్య పరీక్షల కోసం నిరీక్షణ
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని కాటాపూర్ పీహెచ్‌సీలో సోమవారం వైద్యం కోసం వెళ్లిన రోగులు పరీక్షల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. పీహెచ్‌సీ వైద్యాధికారి రంజిత్ ఆస్పత్రికి వచ్చిన రోగులను పరీక్షించి టెస్టులు రాశారు. ఈ క్రమంలో రక్త పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడంతో రోగులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రక్త పరీక్షల అనంతరమే మలేరియా, డెంగీ, టైఫాయిడ్ ఉన్నట్లు తేలితే వైద్యాధికారి వాటికి తగినట్లుగా మందులు రాయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. పలువురు మందులు రాయించుకుని వెళ్లారు. కాటాపూర్ పీహెచ్‌సీ పరిధిలో ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రోగులు వైద్య సేవల కోసం పదుల సంఖ్యలో ఆస్పత్రికి వస్తుంటారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో సిబ్బంది అందరూ అందుబాటులో ఉండేలా జిల్లా వైద్యాధికారి తగిన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంపై వైద్యాధికారి రంజిత్‌ను వివరణ కోరగా ల్యాబ్ టెక్నీషియన్ బంధువులు చనిపోవడంతో వెళ్లగా వేరే వ్యక్తితో పరీక్షలు చేయించినట్లు తెలిపారు.
కాటాపూర్ పీహెచ్‌సీలో అందుబాటులో లేని
ల్యాబ్ టెక్నీషియన్

వైద్య పరీక్షల కోసం నిరీక్షణ