
ఎన్నికల హామీలు అమలు చేయాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం
ములుగు రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందించారు. మున్సిపాలిటీ పరిధిలో డ్రెయినేజీలు, సీసీ రోడ్లు సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామంలో తాగునీటి, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న 200 పడకల ఆస్పత్రిలో రోగులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, నాయకులు రవీంద్రచారి, కృష్ణాకర్, విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.