
అనుమతులు తప్పనిసరి
ములుగు రూరల్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాలలో విగ్రహాలను ప్రతిష్ఠించే నిర్వహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ములుగు ఎస్సై వెంకటేశ్వర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహకులు పోలీస్‌శాఖకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు వివరాలను విలేజ్ పోలీస్ ఆఫీసర్‌కు అందించాలని వివరించారు. పోర్టల్‌లో విగ్రహం ఎత్తు, నిమజ్జనం తేదీ, నిమజ్జన స్థలం, కమిటీ సభ్యుల వివరాలను నమోదు చేయాలని వెల్లడించారు.
ఏటూరునాగారం/వెంకటాపురం(కె): ఏజెన్సీ పరిధిలోని 108 అంబులెన్స్‌ల్లో ఇద్దరు గర్భిణులు ఆదివారం ప్రసవించారు. వివరాల్లోకి వెళ్తే.. ఏటూరునాగారం మండల పరిధిలోని శివాపురం పంచాయతీ పరిధిలో గల లింగాపురం గొత్తికోయగూడేనికి చెందిన మడకం సోనికి పురటి నొప్పుల రావడంతో 108కు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న పైలట్ గడ్డం దశరథం, ఈఎంటీ లోహిత కలిసి ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే పురటి నొప్పులు ఎక్కువై ప్రసవించింది. తల్లీబిడ్డను చికిత్స నిమిత్తం ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా వెంకటాపురం(కె) మండల పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన పూనం దివ్యకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. మహిళను సిబ్బంది ఎదిర ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దివ్యకు ఈఎంటీ ప్రవీణ్, పైలట్ కుమారస్వామి వైద్యసేవలు అందించారు. తల్లీబిడ్డలను ఎదిర ఆస్పత్రిలో చేర్పించి వైద్యసేవలు అందిస్తున్నారు.
● సూపరింటెండెంట్ ఇంజనీర్
మల్చూర్ నాయక్
భూపాలపల్లి రూరల్: విద్యుత్ ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటూ, వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. సర్కిల్‌లోని డీఈ టెక్నికల్ ఆధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించి విద్యుత్ ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామన్నారు. రైతుల సమస్యలను విని పరిష్కరించడానికి విద్యుత్ అధికారుల పొలంబాట కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 358 లూజ్ లైన్లు పునరుద్దరించామని, 682 ఒరిగిన స్తంభాలు సరి చేశామని, 2,216 మధ్య స్థంబాలు నెలకొల్పామని తెలిపారు. 292 లోలెవెల్ లైన్ క్రాసింగ్ డబల్ ఫీడింగ్ పాయింట్లను మార్చమని తెలిపారు. జీరో ప్రమాదాలే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తినా 1912 టోల్ ఫ్రీనంబర్ ద్వారా సంప్రదించాలని మల్చర్ నాయక్ సూచించారు.
గణపతి రుద్రుడిగా
రుద్రేశ్వరస్వామికి అలంకరణ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో భాద్రపద మాసం శుద్ధ పాడ్యమి ఆదివారం శ్రీరుద్రేశ్వరస్వామి వారిని గణపతి రుద్రుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు పానుగంటి ప్రణవ్, పెండ్యాల సందీప్‌శర్మ ఉదయం నుంచి ప్రభాతసేవ, ఉత్తిష్ట గణపతి ఆరాధన రుద్రాభిషేకాలు నిర్వహించారు.

అనుమతులు తప్పనిసరి