ఉమ్మడి వరంగల్‌ స్పెషలాఫీసర్‌గా శశాంక | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి వరంగల్‌ స్పెషలాఫీసర్‌గా శశాంక

Jul 26 2025 9:24 AM | Updated on Jul 26 2025 10:20 AM

ఉమ్మడ

ఉమ్మడి వరంగల్‌ స్పెషలాఫీసర్‌గా శశాంక

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : ఉమ్మడి వరంగల్‌ స్పెషలాఫీసర్‌గా ఐఏఎస్‌ అధికారి కె.శశాంక నియమితులయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్‌కు 2013 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన శశాంక పేరును ప్రకటించింది. ఈ మేరకు చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఆయన గతంలో మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ఇటీవల ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీకి కమిషనర్‌గా నియమించిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్‌ స్పెషలాఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

దరఖాస్తుల ఆహ్వానం

ములుగు రూరల్‌: జిల్లాకేంద్రంలోని మెడికల్‌ కళాశాలలో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, సీనియర్‌ రెసిడెంట్‌, ట్యూటర్‌ పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ స్వర్ణకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రొఫెసర్‌– 06, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ –17, సీని యర్‌ రెసిడెంట్‌–39, ట్యూటర్‌ –04 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. మెడికల్‌ కళాశాల, అనుబంధ ఆస్పత్రిలో పని చేయడానికి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 01, 02వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. మరింత సమాచా రం కోసం https// gmcmulugu. org వెట్‌సైట్‌ సందర్శించాలని కోరారు.

పీఏసీఎస్‌ కార్యాలయం తనిఖీ

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘాన్ని జిల్లా సహకార అధికారి మాలోత్‌ సర్థార్‌సింగ్‌ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల బస్తాల రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఎరువుల బస్తాల సరఫరా గురించి సీఈఓ స్వాతిని అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరికీ ఎరువులను పంపిణీ చేయాలన్నారు. ఎరువుల పంపిణీలో రైతులను ఇబ్బందులకు గురి చెయొద్దన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ పులి సంపత్‌గౌడ్‌, డైరెక్టర్లు యానాల సిద్దిరెడ్డి, రంగరబోయిన జగదీశ్‌, సిబ్బంది ఉన్నారు.

ఎరువుల షాపు తనిఖీ

ఏటూరునాగారం: మండలంలోని పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని జిల్లా సహకార సంఘం అధికారి సర్దార్‌సింగ్‌ శక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఎరువులు విక్రయించారా.. లేదా.. అని పరిశీలించారు. ఎరువుల లోడ్‌తో ఎంత యూరియా నిల్వ వచ్చింది.. ఎంత విక్రయించారని రికార్డుల ద్వారా తెలుసుకున్నారు. మరో లోడు యూరియా వస్తుందని, అర్హులైన రైతులకు మాత్రమే అందించాలని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ సీఈఓ గౌరి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కూనూరు అశోక్‌ పాల్గొన్నారు.

అథ్లెటిక్స్‌ పోటీల ఎంపిక

ములుగు రూరల్‌: జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన నిర్వహించే జిల్లా స్థాయి సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ అండర్‌ 8, 10, 12, 14, 16, 18, 20సంవత్సరాల లోపు బాలబాలికలు, పురుషులు, మహిళల ఎంపిక పోటీల్లో పాల్గొన్నాలని అసోసియేషన్‌ సెక్రటరీ పగడాల వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక పోటీలు మండలంలోని జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు ఆగస్టు 03, 04 తేదీల్లో హనుమకొండలోని జేఎన్‌స్‌లో తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. జావెలిన్‌త్రోలో ఎంపికై న వారు ఆగస్టు 07వ తేదీన జనగామ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 09 గంటలకు హాజరు కావాలని తెలిపారు.

ఉమ్మడి వరంగల్‌  స్పెషలాఫీసర్‌గా శశాంక
1
1/1

ఉమ్మడి వరంగల్‌ స్పెషలాఫీసర్‌గా శశాంక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement