
రాతపరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
ములుగు రూరల్: ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న గ్రామ పరిపాలన అధికారి, లైసెన్స్‌డ్ సర్వేయర్ స్క్రీనింగ్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ మహేందర్‌జీ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలోని డిగ్రీ కళాశాలలో రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పరిపాలన అధికారి పరీక్షకు 26 మంది అభ్యర్థులు హాజరవుతారని అన్నారు. లైసెన్స్ సర్వేయర్ రాత పరీక్ష, ప్రాక్టికల్స్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01 గంటల వరకు, 02 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య పనులు, మంచినీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించారు. పరీక్ష కేంద్రం సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని అన్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం, కలెక్టరేట్ ఏఓ రాజ్‌కుమార్, సూపరింటెండెంట్ శివకుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ మహేందర్‌జీ