
అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం అందించాలి
ములుగు రూరల్: అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ టీఎస్ దివాకర సూచించారు. మల్లంపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. అంగన్‌వాడీ చిన్నారులకు ఆటపాటలతో కూడిన పూర్వపు ప్రాథమిక విద్యను అందించాలని సిబ్బందికి సూచించారు. కేంద్రాల్లో నెలవారీ సెలబస్‌ను కచ్చితంగా అమలు చేయాలని అన్నారు. టీచింగ్ లెర్నింగ్ మెటిరియల్ ఉపయోగించి చిన్నారులకు విద్యా బోధన చేపట్టాలని అన్నారు. క్రమం తప్పకుండా చిన్నారుల ఎత్తు, బరువులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కేంద్రానికి వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడారు. చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారంపై అడిగి తెలుసుకున్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలను ఆస్పత్రికి రెఫర్ చేయాలని అన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ తుల రవి, సీడీపీఓ శిరిష, సూపర్‌వైజర్ కమురునిసాబేగం, అంగన్‌వాడీ టీచర్లు మల్లింకాంబ, ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలి
సీజనల్ వ్యాధులు వాప్తి చెందకుండా అరికట్టాలని కలెక్టర్ దివాకర అన్నారు. మల్లంపల్లిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని మందుల నిల్వలను పరిశీలించారు. వర్షాకాలంలో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. విధుల్లో వైద్యులు నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు. వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే జ్వరపీడితులకు ఏఏ పరీక్షలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రానికి ప్రజలు ఎక్కువగా ఎలాంటి సమస్యలతో వస్తున్నారనే వివరాలపై ఆరా తీశారు. ఆశా కా ర్యకర్తలు ఫీవర్ సర్వే చేపట్టాలని అన్నారు. దోమల నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. డాక్టర్ శ్రవణ్‌కుమార్, ఆయుష్ డాక్టర్ సంధ్య, ఫార్మసిస్టు ఉషారాణి, ఆరోగ్య కార్యకర్తలు మంజుల, వసంత, ఆశా కార్యకర్తలు సుధారాణి, రేణుక, రజిత, సుజాత పాల్గొన్నారు.

అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం అందించాలి