మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యం అందించాలి

Jul 22 2025 8:33 AM | Updated on Jul 22 2025 8:33 AM

మెరుగైన వైద్యం అందించాలి

మెరుగైన వైద్యం అందించాలి

గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌

ములుగు రూరల్‌: వైద్యాధికారులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆయన సోమవారం సందర్శించి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్‌లో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యశాలకు వచ్చే రోగులకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి.చాంద్‌పాషా, భిక్షపతి, రేవంత్‌, తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement