
నీటమునిగిన పొలాలు.. ఇళ్లలోకి చేరిన నీరు
వాజేడు: నీట మునిగిన పంట పొలాలు
వాజేడు: మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో జగన్నాథపురం నుంచి వాజేడుకు వచ్చే ప్రధాన రహదారి పూర్తిగా నీట మునిగి పోయింది. వాజేడు, నాగారం, జగన్నాథపురం, మొరుమూరు ఇలా పలు గ్రామాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో తహసీల్ధార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీకాంత్‌నాయుడు, ఆర్‌ఐ కుమారస్వామి, వాజేడు, పేరూరు ఎస్సైలు సతీష్, కృష్ణ ప్రసాద్ అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు వర్షం సమాచారం అడిగి తెలుసుకుంటూ పరిస్థితిని సమీక్షించారు. జగన్నాథపురంలో వర్షం నీరు భారీగా నిలిచిపోవడంతో కాల్వలను తీయించి బయటకు పంపించారు. అదే విధంగా ముంపునకు గురైన పలు ఇళ్లను పరిశీలించిన అధికారులు ఆయా కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంపు బాధితులు తమకు సమాచారం అందిస్తే పునరావాస కేంద్రానికి తరలిస్తామని మైక్ ద్వారా ప్రచారం చేశారు.

నీటమునిగిన పొలాలు.. ఇళ్లలోకి చేరిన నీరు

నీటమునిగిన పొలాలు.. ఇళ్లలోకి చేరిన నీరు