
చెస్‌తో మేధస్సు పెంపొందుతుంది
భూపాలపల్లి అర్బన్: చెస్ ఆడటం వలన మేధస్సు పెంపొంది సహనం, ఓర్పు వస్తుందని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఆదివారం జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చెస్ పోటీలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబుతో కలిసి ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి మాట్లాడారు. చెస్ క్రీడాకారులకు బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పంతకాని సమ్మయ్య, రవిపటేల్, మహేష్, ఆసిఫ్, మురళి, ప్రకాశ్, శ్రీరాములు, రామనారాయణ పాల్గొన్నారు.