
పారిశుద్ధ్య పనులు బాధ్యతగా చేపట్టాలి
ములుగు రూరల్: మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులను బాధ్యతగా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రై డే ప్రై డే కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ప్రజలు ఇంటి పరిసరాలతోపాటు చుట్టు పక్కల నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. దోమలు వృద్ధి చెందడం వల్ల మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రభలుతాయని అన్నారు. డ్రెయినేజీల్లో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.