
గైర్హాజరు కార్మికులకు కౌన్సెలింగ్
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి విధులకు గైర్హాజరువుతున్న కార్మికులకు గురువారం అఽధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఏరియాలోని మైన్స్‌రెన్స్ స్టేషన్ కాన్ఫరెన్స్‌హాల్‌లో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి, సేవా అధ్యక్షురాలు సునీతరాజేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. గైర్హాజరుకు గల కారణాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. విధులకు హాజరకాకపోవడం వలన కుటుంబంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు, ఇబ్బందులను జీఎం వివరించారు. విధులకు హాజరయ్యేలా కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలని సూచించారు. విధులకు హాజరుకాకపోతే ఉద్యోగం నుంచి డిస్మిస్ అయ్యే అవకాశం ఉందన్నారు. కార్మికుల అనారోగ్య కారణాలను డాక్టర్ సురేష్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం కవీంద్ర, అఽధికారులు రవీందర్, జోతి, ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మధుకర్‌రెడ్డి, అన్ని గనుల సంక్షేమ అధికారులు, కార్మికులు, సేవా కార్యదర్శి లక్ష్మి పాల్గొన్నారు.