
అసంక్రమిత వ్యాధులపై అప్రమత్తం
ములుగు రూరల్: అసంక్రమిత వ్యాధులు నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు అన్నారు. జిల్లా ఆస్పత్రి కార్యాలయంలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలపై గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల్లో పాలేటివ్‌కేర్, మానసిక ఆరోగ్యం, స్పెషల్ న్యూబార్ కేర్ యూనిట్ బ్లడ్ బ్యాంక్, ఆరోగ్య మహిళ కార్యక్రమాలు, పోషకాహార కార్యక్రమాలపై చర్చించడంతో పాటు రికార్డులను మెరుగు పరుచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఎన్‌డీసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ పవన్‌కుమార్, ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ గఫర్, డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పూర్ణ సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు