
జీసీసీ గోదాం పరిశీలన
వెంకటాపురం(కె): మండల కేంద్రలలోని జీసీసీ గోదామును మంగళవారం జిల్లా సివిల్ సప్లయీస్ మేనేజర్ రాంపతి, జీసీసీ ఎంఎల్‌ఎస్ పాయింట్ గోదామును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గోదాములో ఉన్న స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేసి సరుకును పరిశీలించారు. గోదాము, స్టాక్ రిజిస్టర్‌లో ఉన్న స్టాక్‌కు 250 క్వింటాల బియ్యం తక్కువగా వచ్చినట్లు సమాచారం. కాగా ఈ విషయాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు అధికారికంగా ప్రకటించడం లేదు. మాయమైన 250క్వింటాళ్ల బియ్యానికి డబ్బులు చెల్లించాలని అధికారులు ఆదేశించినట్లు తెలిసింది.