
సీతక్క రాజకీయంగా ఎదుర్కోవాలి
ఏటూరునాగారం: మంత్రి సీతక్క ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప తిట్లు, శాపనార్ధాలు పెట్టడం మంత్రి స్థానానికి తగదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు అన్నారు. మండల కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఇటీవల మంత్రి సీతక్క కేటీఆర్‌ను ఎదుర్కోలేక తాను సమ్మక్క తల్లి ఆడబిడ్డను అంటూ ఎదుటి వారిని తిట్టడం, శాపనార్థాలు పెట్టడం ఎంత వరకు సమంజసం అన్నారు. కేటీఆర్ ఐటీశాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించిన గొప్పవ్యక్తి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై దురుసుగా మాట్లాడడం సరికాదన్నారు. జిల్లాలో ఎన్నో సమస్యలున్నాయని వాటిపై దృష్టి పెట్టాలన్నారు. గతంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన ఒక్కో రైతుకు రూ.10వేలు ఆర్థిక సాయం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. వర్షాలు పడుతాయని నార్లు పోసుకున్న రైతులు వర్షాలు లేక, బోరు బావుల నీటిని పారించుకుందామనుకున్నా విద్యుత్ సరఫరా సరిగా ఉండడం లేదన్నారు. ఏజెన్సీలోని రైతులకు దేవాదుల పైపులైన్ ద్వారా లక్నవరం, రామప్ప చెరువులను నింపి సాగునీరు అందించాలన్నారు. బీసీ రిజర్వేషన్ 42 శాతం ఇవ్వాలని అసెంబ్లీలో బీఆర్‌ఎస్ పార్టీ తీర్మానం చేయగా అన్ని పార్టీలు మద్దతు తెలిపితే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఆర్దినెన్స్ ద్వారానే రిజర్వేషన్ తెస్తామని బీసీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కొండాయి, మల్యాల గ్రామాలకు వెళ్లే దా రిలోని జంపన్నవాగుపై బ్రిడ్జి నిర్మాణం ఇంకా చేపట్ట లేదన్నారు. కార్యక్రమంలో మల్లారెడ్డి, కృష్ణ, సు నీల్‌కుమార్, ప్రదీప్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌పై తిట్లు, శాపనార్థాలు తగవు
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
లక్ష్మీనర్సింహారావు