
ఎయిడ్స్‌పై అవగాహన తప్పనిసరి
● ఐసీటీసీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు
ఏటూరునాగారం: ప్రజలు ఎయిడ్స్ వ్యాధిపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సామాజిక వైద్యశాల ఐసీటీసీ కౌన్సిలర్ గులగట్టు వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని రామన్నగూడెంలో మంగళవారం ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు దిశ వారి సౌజన్యంతో హెల్త్ శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, టీబీ, హైపటైటిస్‌బీ, సిఫిలిస్, హెచ్‌ఐవీ పరీక్షలు 50 మందికి చేసినట్లు వివరించారు. ఎవరికై నా హెచ్‌ఐవీపై అనుమానం ఉంటే క్రాస్‌రోడ్డులోని సామాజిక ఆస్పత్రిలో ఐసీటీసీ సెంటర్‌లో ఉచితంగా పరీక్షలు చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐహెచ్‌సీ మొబైల్ వాహన కౌన్సిలర్ అనూష, ల్యాబ్ టెక్నీషియన్ సాగర్, ఏఎన్‌ఎం ధనలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ జైలు బాబు, గ్రామ కార్యదర్శి జ్యోతి, ఆశ కార్యకర్తలు కాశింబీ, లావణ్య, ఔట్ రీచ్ వర్కర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.