
బెస్ట్ సొసైటీగా ములుగు పీఏసీఎస్
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బెస్ట్ సొసైటీగా ఎంపికై ంది. సొసైటీ నిర్వహణ, రైతులకు అందించిన రుణాల వంటి సేవలను గుర్తించి నాబార్డు సంస్థ వారు అవార్డును అందించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు నుంచి పీఏసీఎస్ చైర్మన్ బొక్క సత్తిరెడ్డి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఏసీ ఎస్‌కు అవార్డు రావడం గర్వంగా ఉందన్నారు.
రూ.3.16 లక్షల చెక్కు అందజేత
వాజేడు: వాజేడు పీఏసీఎస్‌కి రూ.3.16 లక్షల చెక్కును టెక్సాబ్ చైర్మన్ రవీందర్‌రావు అందజేశారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థకు పీఏసీఎస్ ఎంపిక కావడంతో హైదరాబాద్‌లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆఫీస్ ఖర్చులకు చెక్కు తనకు అందజేసినట్లు సొసైటీ అధ్యక్షుడు అంజయ్య తెలిపారు.