
వినతులిచ్చాం.. పరిష్కరించండి
ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో వినతుల వెల్లువ
● కలెక్టరేట్, గిరిజన దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ దివాకర, పీఓ చిత్రామిశ్రా
● పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశం
ములుగు రూరల్/ ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ప్రజ లు తమ సమస్యలు పరి ష్కరించాలని కోరుతూ వినతులు అందజేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేశ్వర్లుతో కలిసి వివిధ సమస్యలపై వచ్చిన 75 దరఖాస్తులను స్వీకరించారు. అలాగే ఐటీడీఏలో పీఓ చిత్రామిశ్రా 40 వినతులు స్వీకరించారు. మొ త్తంగా వచ్చిన 115 వినతులు తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని ఆ యా శాఖల అధికారులను వారు ఆదేశించారు.
గిరిజన దర్బార్‌లో వినతులు ఇలా..
వెంకటాపురం మండలం ఎదిర గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళా స్టాఫ్ నర్సు ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. ములుగు మండలంలోని రాయినిగూడెం గ్రామానికి చెందిన నిరుద్యోగురాలు అవుట్ సోర్సింగ్‌లో అటెండర్ ఉద్యోగం ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. గోవిందరావుపేట మండలం మచ్చాపురం గ్రామానికి చెందిన ఓ రైతు తన తండ్రి పేరుపై ఉన్న పట్టాదారు పాసుపుస్తకం తన పేరుపై మార్చాలని పీఓకు విన్నవించారు. మంగపేట మండంలోని అటవీశాఖ ద్వారా ఓ కార్పొరేషన్ సంస్థలో వేసిన జామాయిల్ కటింగ్, కొనుగోళ్లను పెసా గ్రామ సభల ద్వారా తీర్మాణం చేసి ఆదివాసీ రైతులకు జీవనోపాద్ధి కల్పించాలని రైతులు మొరపెట్టుకున్నారు. కన్నాయిగూడెం మండలం గుట్టలగంగారం గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగురాలు అంగన్‌వాడీ టీచర్ పోస్టు ఇప్పించాలని కోరారు. ములుగు మండలంలోని గిరిజన ఆశ్రమ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్ ఉద్యోగ అవకాశం కల్పించాలని ఓ గిరిజనుడు కోరారు. ఉమ్మడి జిల్లాలోని సీఆర్‌టీలను రెన్యువల్ చేయాలని సీఆర్‌టీలు కోరారు. ఏటూరునాగారం మండలం మల్యాలకు చెందిన ఓ గిరిజనుడు తనకు ఒకేషనల్ ట్రైనింగ్ ఇప్పించాలని కోరారు. గోవిందరావుపేట మండలంలోని 127 మంది గిరిజనులు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు కావాలని, 36 మంది ఇందిరమ్మ ఇళ్లు కావాలని పీఓకు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్‌ఎస్ తాడ్వాయి నుంచి 297 మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు కావాలని దరఖాస్తులు అందజేశారు. ఇలా పలువురు బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, డీడీ పోచం, ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేష్‌బాబు పాల్గొన్నారు.

వినతులిచ్చాం.. పరిష్కరించండి