
తాగునీటి కోసం రాస్తారోకో
వెంకటాపురం(కె): మండల పరిధిలోని బోదా పురం పంచాయతీ పరిధిలోని గుట్టబోరు గ్రామస్తులు తాగునీటి కోసం సోమవారం ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి పథకం మోటర్ మరమ్మతులకు గురైందని రిపేర్ చేయించాలని పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకుకెళ్లగా పట్టించుకోవడం లేదని వాపోయారు. విషయం తెలుసుకున్న ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు రాస్తారోకో విరమించారు.
ఖాళీ బిందెలతో రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు