
సఖి సేవలు వినియోగించుకోవాలి
ములుగు రూరల్: గృహ హింస బాధితులు సఖి సేవలు వినియోగించుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్ అన్నారు. ఈమేరకు శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సఖి కేంద్రంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేధింపులకు గురవుతున్న మహిళలు న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. ఆపదలో ఉన్న మహిళలకు సఖి సిబ్బంది సత్వర సహాకారాలు అందించాలని సూచించారు. ఉచిత న్యాయ సహాయం, లీగల్ సర్వీస్ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాదికారి తుల రవి, డీసీపీఓ ఓంకార్, లావణ్య, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.