
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందుండాలి
ములుగు రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందుండాలని అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఇళ్లు మంజూరై గ్రౌండింగ్ కాని ఇళ్లను వారం రోజుల్లో గ్రౌండింగ్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణాలు త్వరగా పూర్తి చేస్తే త్వరగా బిల్లులు చెల్లిస్తామని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. మండలాల వారీగా కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం, లబ్ధిదారులు నిర్ధారణ, మంజూరులు తెలిపి ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ విషయంలో వెనుకబడిన మండలాలను గుర్తించి లక్ష్యసాధనకు అధికారులు అంకితభావంతో పని చేయాలని సూచించారు. పంచాయితీ కార్యదర్శులు లబ్ధిదారులను నేరుగా కలిసి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ఇంటి నిర్మాణాలకు నిధుల సమస్య లేదని తెలిపారు. ఇంటి నిర్మాణ పనులను దశల వారీగా ఫొటోలను వెబ్‌సైట్‌లో అందుబాటు ఉంచాలన్నారు. ఇంటి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించాలి
జిల్లాలో ఏర్పాటు చేయనున్న క్రేచ్ సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మొబైల్ క్రేచ్ సంస్థ సహకారంతో అంగన్‌వాడీలకు పాలన స్కీంలో 8 రోజుల పాటు శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొబైల్ క్రేచ్ సంస్థ ట్రైనర్స్ నీలం శ్రీవాత్సవ, విజయలక్ష్మీ మణికప్పలు. 14మంది అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ అందించగా వారిని అభినందించి ప్రసంసా పత్రాలు అందించారు.
కలెక్టర్ టీఎస్.దివాకర