
జనం.. కుటుంబ బలం!
చిన్న కుటుంబమే మంచిది..
ఏటూరునాగారం: 1992లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు నవ్య, సౌమ్యలు జన్మిచండంతో చాలు అనుకున్నాం. ఇద్దరు ఆడపిల్లలు కావడంతో పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి పంపించాము. పిల్లలు వెళ్లిపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాం. ప్రస్తుత కాలంలో మారిన ఆర్థిక పరిస్థితుల దృష్యా ఇద్దరు పిల్లలే ముద్దు. ముగ్గురు ఉంటే ఖర్చులు భరించడం ఇబ్బందిగా ఉంటుంది. చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం. – గడ్డం సదానందం, శారద
ఒక్కరే చాలు అనుకున్నాం..
ఏటూరునాగారం: మండలంలోని 7వ వార్డుకు చెందిన చిటమట గంగాధర వసంతలకు 2005 ఫిబ్రవరి 18న వివాహం జరిగింది. వీరికి కుమారుడు సాయి నిషాంత్ ఉన్నారు. మారుతున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒక్కరే మంచిదని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం కుమారుడు ఐఏఎస్ కోచింగ్ పొందుతున్నాడు. ఇద్దరం చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం.
– చిటమట గంగాధర, వసంత
ఒకప్పుడు ప్రతీ ఇంట్లో పిల్లల సైన్యం ఉండేది. రేషన్ కార్డులోనైతే వారి పేర్లకు జాగా సరిపోయేది కాదు. అలాంటిది కుటుంబ నియంత్రణ శాఖ అవగాహన. పెరుగుతున్న ఆర్థిక భారం తదితర కారణాలతో ఎక్కువ మంది పిల్లలు వద్దనుకుంటూ ‘మేమిద్దరం.. మాకిద్దరు’ అంటూ ఇద్దరితో సరిపెట్టుకున్నారు. ఆధునికతతో పరుగులు పెడుతున్న యువత, , భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడం, పిల్లలను చూసుకునేవారు లేకపోవడంతో ప్రస్తుతం ‘ఒక్కరు చాలు’ అంటున్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే భవిష్యత్‌లో యువజనులు తగ్గే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కువమంది పిల్లల్ని కన్న కుటుంబాలు ఎలా సంతోషంగా ఉండగలిగారు? జీవితాలకు ఉమ్మడి కుటుంబాలు ఎలా మేలు చేస్తాయి? తదితర అంశాలపై జిల్లావాసులేమంటున్నారనేది నేడు(శుక్రవారం) ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఎక్కువమంది పిల్లలున్నా ఉన్నతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులు
ప్రస్తుతం ఒక సంతానానికే
ప్రాధాన్యమిస్తున్న యువజంటలు
మారుతున్న కాలానికనుగుణంగా ఫ్యామిలీ ప్లానింగ్
పరిస్థితులు ఇలానే ఉంటే భవిష్యత్‌లో యువజనాభా తగ్గుతుందంటున్న పరిశీలకులు
నేడు ప్రపంచ జనాభా దినోత్సవ

జనం.. కుటుంబ బలం!

జనం.. కుటుంబ బలం!