
ప్రభుత్వానికి రూ. 6.89లక్షల ఆదాయం
ఏటూరునాగారం: ఏటూరునాగారం ఎకై ్సజ్ కార్యాలయం పరిధిలోని వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను గురువారం ఎకై ్సజ్ సూపరింటెండెండ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు వాహనాల వేలం పాటను స్థానిక ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించినట్లు ఎకై ్సజ్ సీఐ కిశోర్ తెలిపారు. ఈ వేలం పాటకు ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ లింగాచారి హాజరై నిర్వహించగా 24 వాహనాలకు రూ. 6.89 లక్షల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర సదస్సును
విజయవంతం చేయాలి
మలుగు రూరల్: ఈ నెల 16న హనుమకొండలో నిర్వహించనున్న బ్యాండ్ వాయిజ్య కళాకారుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షులు అంకూస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో వాయిజ్య కళాకారుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ తేదీ ఉదయం హనుమకొండలోని లష్కర్ ఫంక్షన్‌హాల్‌లో ఉదయం 11గంటలకు రాష్ట్ర సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సదస్సుకు కళాకారులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రవీందర్, సాంబయ్య, ఐలయ్య పాల్గొన్నారు.