
వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీ షిర్డీసాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలను ఆలయ నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో గురువారం ఉదయం సాయిబాబా, దత్తాత్రేయుడు, వినాయకుడి విగ్రహాలకు పంచామృత అభిషేకాలను, పుష్పార్చనలను అర్చకులు యల్లాప్రగడ భానుప్రకాశ్ శర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఏఎస్పీ శివం ఉపాధ్యాయ దంపతులతో ఆలయానికి చేరుకొని పుష్పార్చనలను చేశారు. అలాగే భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలను కొట్టి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించగా ఏఎస్పీ దంపతులు స్వయంగా వడ్దించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆయన వెంట స్థానిక ఎస్సై రాజ్‌కుమార్, ఆలయ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్‌తో పాటు జగదీశ్, సతీష్, రమేష్, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.