మల్బరీ సాగుతో ఆదాయం | - | Sakshi
Sakshi News home page

మల్బరీ సాగుతో ఆదాయం

Jul 7 2025 6:38 AM | Updated on Jul 7 2025 6:38 AM

మల్బర

మల్బరీ సాగుతో ఆదాయం

ఏటూరునాగారం: పట్టుపరిశ్రమ శాఖ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందేలా పలు ప్రోత్సాహక పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో మల్బరీ తోటల సాగు, పట్టు పురుగులను పెంచడానికి ముందుకొచ్చే రైతులకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. తోట పెంపకం ప్రారంభ దశ నుంచి విక్రయించే వరకు రైతులకు అధిక లాభాలు చేకూరేలా పథకాన్ని రూపొందించింది.

జిల్లాలోని 10 మండలాల పరిధిలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న భూములు మల్బరీ తోటల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయి. రెండు ఎకరాల్లో మల్బరీ తోట సాగు చేస్తే సదరు రైతుకు సాగు చేసినందుకు ఏడాదికి రూ.4 నుంచి 6లక్షల వరకు నికర ఆదాయం కల్పించడంతో పాటు ప్రభుత్వమే పంటను కొనుగోలు చేస్తుంది. మల్బరీ తోట బహువార్షిక పంట కావడంతో తక్కువ నీటితో పంటను సాగు చేసుకునే అవకాశం ఉంది. ఒక్కసారి మల్బరీ మొక్కలు నాటితే 15 నుంచి 20 ఏళ్ల వరకు ప్రతీ ఏడాది పట్టు పురుగుల మేతకోసం ఆకుల పంట దిగుబడి వస్తుంది. ఈ తోట అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకొని పంట దిగుబడి ఘననీయంగా వస్తుంది.

గతంలో ఏటూరునాగారంలోనే పరిశ్రమ

గతంలో పట్టుపరుగుల పరిశ్రమ ఏటూరునాగారంలో ఉండేది. 2004లో మావోయిస్టులు పట్టుపరిశ్రమకు చెందిన భవనాలను కూల్చివేశారు. దీంతో అందులోని సామగ్రి దొంగల పాలు కాగా భూములన్నీ కబ్జాకు గురయ్యాయి. ఈ క్రమంలో ఏటూరునాగారం మండల కేంద్రంలో పట్టు పురుగుల పెంపకం పరిశ్రమను మూసివేశారు. ఇప్పుడు మల్బరీ తోటలు వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లో ఎక్కువగా సాగు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

బీసీ, ఓసీలకు రాయితీ ఇలా..

బీసీ, ఓబీసీలకు మల్బరీ తోటల పెంపకానికి రెండు ఎకరాలకు రూ.60 వేల సబ్సిడీని ప్రభుత్వం ఇస్తోంది. అదే విధంగా మల్బరీ పట్టు పురుగుల పెంపకం గది నిర్మాణానికి రూ.2.25లక్షలు, స్టాండ్లు, ఇతర పరికరాలకు రూ. 37,500, రోగ నిరోధక చర్యలు, క్రిమి సంహారక మందుల కోసం రూ. 2,500లు, నీటి పారుదల కోసం రూ.50వేలు అందజేస్తోంది.

ఎస్సీ, ఎస్టీ రైతులకు..

మల్బరీ తోట పెంపకం, నిర్వహణకు రూ.78వేలు సబ్సిడీ ఇస్తోంది. పట్టు పురుగుల పెంపకం గది నిర్మాణానికి రూ.2,92,500, రేరింగు పరికరాలకు రూ.26,610, రేరింగు స్టాండ్స్‌కు రూ.24,140, రోగ నిరోధక చర్యలకు రూ.3,250, నీటి పారుదలకు రూ.65 వేలను కేంద్ర ప్రభుత్వం రాయితీగా రైతులకు అందజేస్తుంది. ఈ మేరకు ఆసక్తి కలిగిన రైతులు జిల్లాలోని పట్టు పరిశ్రమ శాఖ అధికారులను సంప్రదించి పథకాన్ని పొందవచ్చు.

రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి..

కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు వేర్వేరుగా పథకాలను అందజేయనున్నారు. రైతులకు సొంతంగా రెండు ఎకరాల భూమి ఉంటే సరిపోతుంది. వార్షిక ఆదాయం ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది. అన్ని వర్గాల రైతులు సద్వినియోగం చేసుకోవాలి. మరింత సమాచారం కోసం సెల్‌ నంబర్‌ 9441770795, 8977714616 లలో సంప్రదించాలి. – మాచర్ల నరేందర్‌,

పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారి

రైతులకు భారీగా సబ్సిడీ ఇస్తున్న కేంద్రం

జిల్లాల వారీగా సాగుకు ప్రత్యేక కార్యాచరణ

మల్బరీ సాగుతో ఆదాయం1
1/3

మల్బరీ సాగుతో ఆదాయం

మల్బరీ సాగుతో ఆదాయం2
2/3

మల్బరీ సాగుతో ఆదాయం

మల్బరీ సాగుతో ఆదాయం3
3/3

మల్బరీ సాగుతో ఆదాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement