
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
రేగొండ: మహిళల ఆర్థికాభివృద్ధే మహిళా సమాఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో జనని మండల మహిళా సమాఖ్య కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ మహిళను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సహకారం అందించడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదన్నారు. త్వరలో నూతన మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం బాలయ్యపల్లి గ్రామంలోని పలువురు బీఆర్‌ఎస్ నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ బాలకృష్ణ, డీపీఎం వేణుగోపాల్, ఏపీఎం తిరుమల్ సింగ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వర్ణలత, కార్యదర్శి సుమలత, కోశాధికారి మమత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య, నాయకులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి సార్..
కొత్తపల్లిగోరిలో మొహర్రం వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సత్యనారాయణరావును శాయంపేట మండలం కొప్పులకు చెందిన చిన్నారి మామిడి మీనాక్షి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి సార్ అంటూ అడిగింది. చలించిన ఎమ్మెల్యే పేరు నమోదు చేసుకుని మంజూరు పత్రాలను స్వయంగా అందజేస్తానని హామీ ఇచ్చారు.

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం