
భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మకు బోనాలు
ఏటూరునాగారం : మండల కేంద్రంలోని రామాలయం వీధిలో గల ముత్యాలమ్మకు స్థానికులు శనివారం భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ముత్యాలమ్మ ఆలయం నిర్మించి తొమ్మిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పండితులు అమ్మవారికి వార్షికోత్సవ పూజలు చేశారు. గ్రామంలోని బొడ్రాయివద్ద ప్రత్యేక పూజలు చేసి డప్పుచప్పుళ్ల ఊరేగింపుగా బోనాలతో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ సునార్కని శ్రీనివాస్, జాడి భోజారావు, కుమ్మరి చంద్రబాబుతోపాటు రాజ్‌కుమార్, సమ్మయ్య, లక్ష్మయ్య, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.