
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో స్వరాష్ట్ర సాధన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మురహరి భిక్షపతి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లాకేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నిరవదిక దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, గుర్తింపు కార్డు, 25 వేల పింఛన్, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిక అనంతరం ఉద్యమకారులను పట్టించుకోవడం లేదన్నారు. హామీలను అమలు చేయని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోరిక గోవింద్‌నాయక్, జంపాల రవీందర్, చంటి భద్రయ్య, ముంజాల భిక్షపతి, సర్ధార్‌పాషా, గోపాల్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, సదయ్య, శ్రీధర్, శ్రీనివాస్, మల్లయ్య, సమ్మక్క, లక్ష్మీ, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
సంఘం జిల్లా అధ్యక్షుడు భిక్షపతి