
వైద్యవృత్తికి ఎంతో గౌరవం
ములుగు రూరల్: సమాజంలో వైద్య వృత్తికి ఎంతో గౌరవం ఉందని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం జాతీయ డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ కేక్ కట్ చేసిన అనంతరం ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పేద ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలన్నారు. వైద్యాధికారులందరూ వైద్య వృత్తికి న్యాయం చేయాలని సూచించారు. వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగీ నియంత్రణకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వ్యాధులను అదుపులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీకాంత్, పవన్‌కుమార్, చంద్రకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు