నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి

Jul 4 2025 7:01 AM | Updated on Jul 4 2025 7:01 AM

నాటిన

నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి

వెంకటాపురం(ఎం): నాటిన మొక్కలను సంరక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని రామప్ప ఆలయ కార్యనిర్వహణ అధికారి బిల్లా శ్రీనివాస్‌ తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా గురువారం రామప్ప గార్డెన్‌లో వేప, ఉసిరి, మందార మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు కోమల్లపల్లి హరీశ్‌ శర్మ, ఉమాశంకర్‌, ఆలయ సిబ్బంది సంతోష్‌, అవినాష్‌రెడ్డి, పురావస్తుశాఖ అధికారి కుమార్‌ పాల్గొన్నారు.

డీసీసీ బ్యాంకు

మార్కెట్‌ రోడ్డుకు తరలింపు

ములుగు రూరల్‌: జిల్లా కేంద్రంలోని పాత చేపల మార్కెట్‌ రోడ్డులో ఉన్న డీసీసీ బ్యాంకు ను ములుగు కూరగాయల మార్కెట్‌ రోడ్డు (ఎకై ్సజ్‌ ఆఫీస్‌) పక్కకు తరలిస్తున్నట్లు బ్యాంక్‌ మేనేజర్‌ తిరుపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు నూతన భవనంలో రేపటి(5వ తేదీ) నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఖాతాదారులు సహకరించాలని కోరారు.

సమస్యల పరిష్కారానికి పొలంబాట

ములుగు రూరల్‌: రైతుల విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి అధికారులు పొలంబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భూపాలపల్లి సర్కిల్‌ సేఫ్టీ ఆఫీసర్‌, డివిజనల్‌ టెక్నికల్‌ వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా వంగిన పోల్స్‌ 351, లూజ్‌లైన్స్‌ 134, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు 36 మార్చినట్లు వివరించారు. రైతులకు మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని తెలిపారు. పొలంబాట కార్యక్రమంలో రైతులకు విద్యుత్‌ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు మోటార్ల వద్ద ఎర్తింగ్‌ చేసుకోవడంతో పాటు మోటార్లకు కెపాసిటర్లు ఉపయోకరంగా ఉంటాయని వివరించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఫెయిల్‌ అయితే వెంటనే రైతులు 1912 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన 48 గంటల వ్యవధిలో విద్యుత్‌ సరఫరా అందించలేని పక్షంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని వివరించారు.

‘ఇచ్చిన హామీలు

నెరవేరుస్తాం’

ములుగు రూరల్‌: ఎన్నికల సమయంలో బండారుపల్లి గ్రామంలోని బుడగజంగాల కాలనీ వాసులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని జిల్లా గరంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌ అన్నారు. ఈ మేరకు గురువారం కాలనీవాసులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. బుడుగజంగాల కాలనీ వాసులకు ఎన్నికల సమయంలో విద్యుత్‌, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింత నిప్పుల భిక్షపతి, కాంగ్రెస్‌ మండల పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నల్లెల భరత్‌ కుమార్‌, నాయకులు అశోక్‌, రాజన్న, నాగరాజు, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

చిన్న కాళేశ్వరం

పనుల అడ్డగింత

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కేంద్రంలోని ఎర్రచెరువు మీదుగా సర్వే చేస్తున్న మెయిన్‌ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ పనులను స్థానికులు గురువారం అడ్డుకున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలు సంయుక్తంగా సర్వే జరుపుతుండగా రైతులు, ప్రజలు అడ్డుకొని కెనాల్‌ నిర్మాణం వద్దని అధికారులతో తేల్చిచెప్పారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. తహీసీల్దార్‌ రామారావు, డీటీ కృష్ణ, ఏఈ భరత్‌ తదితరులు ఉన్నారు.

నాటిన మొక్కలను  సంరక్షించుకోవాలి
1
1/1

నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement