శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025

Jul 4 2025 7:01 AM | Updated on Jul 4 2025 7:03 AM

4లోu

ములుగు రూరల్‌: అంగన్‌వాడీ కేంద్రాలలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఫేస్‌ రికగ్నేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. అంగన్‌వాడీ కేంద్రాలలో పారదర్శకతను పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే బాలామృతం, గుడ్లు, పాలు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సమస్యను అధిగమించి లబ్ధిదారులకు సక్రమంగా పౌష్టికాహారం అందే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు మహిళ శిశు సంక్షేమశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ఐసీడీఎస్‌ అధికారులు సిద్ధమయ్యారు. నిత్యం చిన్నారుల ఫొటోలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు చేస్తున్నారు.

మూడేళ్లలోపు

చిన్నారులకు..

ఫేస్‌ రికగ్నేషన్‌ విధానం ఉపయోగించి ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సు కలిగిన చిన్నారులకు బాలామృతం, గుడ్లు వంటి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా చిన్నారి తల్లి ఫొటోను ఫేస్‌ రికగ్నేషన్‌ ద్వారా ఫొటోలను తీసుకొని పోషన్‌ ట్రాకర్‌ యాప్‌లో నమోదు చేసి సరుకులు అందిస్తున్నారు.

జూలై నుంచి అందరికీ..

అంగన్‌వాడీ కేంద్రాలలో నమోదైన బాలింతలకు, గర్భిణులు, చిన్నారులు జూలై నుంచి ఫేస్‌ రికగ్నేషన్‌ ద్వారా సరుకులు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అంగన్‌వాడీ టీచర్ల మొబైల్‌ ఫోన్‌లో పోషన్‌ ట్రాకర్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. యూప్‌లో ఫొటోలు నమోదు కావడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉండవని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సాంకేతిక సమస్యలతో ఇబ్బంది

పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లో ఫేస్‌ రికగ్నేషన్‌ ఫొటోలు అప్‌లోడ్‌ చేసే క్రమంలో ఏజెన్సీ గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలలో సాంకేతిక సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంగన్‌వాడీ టీచర్లు పౌష్టికాహారం అందించే క్రమంలో తప్పనిసరిగా ఫొటో అప్‌లోడ్‌ చేయాల్సి రావడంతో సరుకుల పంపిణీ సమస్యగా మారుతుందని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులకు చెబుతున్నారు. ఉన్నతాధికారులకు నెట్‌వర్క్‌ సమస్యలపై అంగన్‌వాడీ టీచర్లు సమాచారం అందించినట్లు తెలుస్తుంది.

640 అంగన్‌వాడీ కేంద్రాలు

జిల్లాలోని పది మండలాల్లో నాలుగు ప్రాజెక్టులు ఏటూరునాగారం, ములుగు, ఎస్‌ఎస్‌ తాడ్వాయి, వెంకటాపురం(కె)లో ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తంగా 640 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మూడేళ్ల వయస్సు కలిగిన చిన్నారులు 8,722 మంది ఉన్నారు. గర్భిణులు 1,864, బాలింతలు 1,800, 3నుంచి ఆరేళ్ల వయస్సు కలిగిన వారు 6,424 మందికి పౌష్టికాహారం అందిస్తున్నారు.

ఏజెన్సీలో నెట్‌వర్క్‌

సమస్య ఉంది..

జిల్లాలోని 24 ఏజెన్సీ గ్రామాలలో నెట్‌వర్క్‌ సమస్య కారణంగా చిన్నారుల ఫేస్‌ రికగ్నేషన్‌ నమోదు ప్రక్రియ ఇబ్బంది అవుతుంది. మిగితా కేంద్రాలలో తప్పని సరిగా పోషన్‌ ట్రాకర్‌లో నమోదు చేస్తున్నారు. యాప్‌ ద్వారా ఫౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా లబ్ధిదారులకు చేరుతుంది.

– తుల రవి, జిల్లా సంక్షేమాధికారి

న్యూస్‌రీల్‌

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫేస్‌ రికగ్నేషన్‌

పారదర్శకత పెంచేలా చర్యలు

జిల్లాలో 4 ప్రాజెక్టులు 640 కేంద్రాలు

ఇంటర్నెట్‌ సమస్యతో ఇబ్బందులు

శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 20251
1/2

శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025

శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 20252
2/2

శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement