
రూ. 19 లక్షలు రావాల్సి ఉంది
వెంకటాపురం(ఎం) సర్పంచ్‌గా ఉన్న సమయంలో రూ.19లక్షలు ఖర్చుపెట్టి అభివృద్ధి పనులు చేశాను. పంచాయతీకి ప్రహరీ నిర్మాణం, సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా వీధి దీపాల ఏర్పాటు, గ్రావెల్ పనులు చేసినప్పటికీ ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. చేసిన పనులకు గాను ఎంబీ రికార్డులు సైతం ఉన్నాయి. రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి.
– మేడబోయిన అశోక్,
సర్పంచ్‌ల ఫోరం మాజీ మండలాధ్యక్షుడు వెంకటాపురం(ఎం)