
ఎయిడ్స్‌పై అవగాహన తప్పనిసరి
గోవిందరావుపేట: ఎయిడ్స్‌పై ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని వైఆర్‌జీ కేర్ లింక్ వర్కర్స్ స్కీం సంస్థ సూపర్‌వైజర్ రజిని అన్నారు. మండల కేంద్రంలో బుధవారం జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంప్ నిర్వహించి స్థానికులకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులతో బాధపడకుండా అన్ని టెస్ట్‌లతో పాటు హెచ్‌ఐవీ టెస్ట్ కూడా చేయించుకోవాలన్నారు. హెచ్‌ఐవీ నాలుగు విధాలుగా సోకుతుందన్నారు. సురక్షితం కాని లైంగిక సంబంధాలతో, కలుషితమైన సూదులు, పరీక్షించని రక్త మార్పిడి ద్వారా హెచ్‌ఐవీ సోకుతుందని వివరించారు. హెచ్‌ఐవీ తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు సైతం వస్తుందన్నారు. గర్భిణులు తప్పకుండా హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఒకవేళ గర్భిణికి హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలితే బిడ్డకి రాకుండా మందులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం శకుంతల, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
వైఆర్‌జీ కేర్ లింక్ సంస్థ సూపర్‌వైజర్ రజిని