
నాణ్యమైన భోజనం అందించాలి
ఏటూరునాగారం: ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం మండలంలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వంటగదులను పరిశీలిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గురుకుల, ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని, సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉపాద్యాయులు నాణ్యమైన బోధన చేయాలన్నారు. కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఏ క్షేత్రయ్య, తహసీల్దార్ జగదీష్, ఎంపీడీఓ కుమార్, హెచ్‌ఎం ఈసం రమేశ్, ఉపాద్యాయులు పాల్గొన్నారు. అనంతరం సామాజిక ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూపరింటెండెంట్ సురేశ్‌కుమార్‌కు తెలిపారు.
పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..
ఏటూరునాగారం/మంగపేట:గోదావరి నీటి మట్టం పెరుగుతుందని, ఏజెన్సీలోని కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం మండలంలోని రామన్నగూడెం కరకట్ట, మంగపేట కరకట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో వరద మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని, వరద ప్రమాద స్థాయిలో పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంపై ప్రజ లకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టరేట్ కా ర్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ జగదీశ్, తహసీల్దార్ జగదీష్, అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి
వెంకటాపురం(కె): ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని మలాపురం, రాచపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులను త్వరగా పొందాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు రూమ్‌ను పరిశీలించి, భూభారతి చట్టంపై రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్, తహసీల్దార్ వేణుగోపాల్, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రతపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
ఏజెన్సీ గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ దివాకర టీఎస్
పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య
ములుగు రూరల్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్‌లో దొడ్డి కొమురయ్య 79వ వర్థంతిని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సర్ధార్‌సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై డీకే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, విముక్తి ఉద్యమ పోరాటంగా మారడానికి దొడ్డి కొమురయ్య అమరత్వమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు నరిగె రాజ్‌కుమార్, సాంబయ్య, మల్లయ్య, సంపత్, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంజీవ, ఎస్సీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, ఉద్యోగులు సరిత, మానస, రేణుక, కుమారస్వామి, ప్రతాప్, గోపాల్‌చారి తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన భోజనం అందించాలి