భూ భారతి సమస్యలు త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

భూ భారతి సమస్యలు త్వరగా పరిష్కరించాలి

Jul 5 2025 6:38 AM | Updated on Jul 5 2025 6:38 AM

భూ భా

భూ భారతి సమస్యలు త్వరగా పరిష్కరించాలి

వాజేడు: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ భారతి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ములుగు ఆర్డీఓ వెంకటేష్‌ అన్నారు. శుక్రవారం వాజేడు తహసీల్దార్‌ కార్యాలయంలో చేపట్టిన భూభారతి తనిఖీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలను చేయడంతోపాటు వారసత్వ, సాదాబైనామా, మిస్సింగ్‌ సర్వే నంబర్లపై వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ కుమారస్వామి, డీటీ చంద్ర శేఖర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ నగేష్‌, సిబ్బంది ఉన్నారు.

రోడ్డు భద్రత

నియమాలను పాటించాలి

ములుగు రూరల్‌: రోడ్డు భద్రత నియమాలను ప్రతిఒక్కరూ పాటించాలని ఆర్టీఓ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం జాతీయ రహదారిపై త రచూ రోడ్డు ప్రమాదం జరిగే ప్రాంతాలను ఆ యన పరిశీలించారు. రోడ్డు ప్రమాద చర్యల్లో భాగంగా పోలీస్‌, ఆర్‌ అండ్‌ బీ, ఎన్‌హెచ్‌ అధి కారులతో కలిసి గట్టమ్మ, మల్లంపల్లి, ప్రాంతాలను పరిశీలించారు. ప్రమాద నివేదికలను రూపొందించి ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌తో పాటు స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్‌రావు, ఆర్‌అండ్‌బీ ఏఈ రాకేష్‌, ఎన్‌హెచ్‌ అధికారులు పాల్గొన్నారు.

బాస్కెట్‌బాల్‌

జిల్లా జట్టు ఎంపిక

ములుగు రూరల్‌: జిల్లా కేంద్రంలోని సన్‌రైజర్స్‌ హైస్కూల్‌లో శుక్రవారం జిల్లా అండర్‌ 18 బాస్కెట్‌ బాల్‌ జట్టును ఎంపిక చేసినట్లు బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివకృష్ణ తెలిపారు. జిల్లా జట్టు ఎంపికకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 30 మంది హాజరైయ్యారన్నారు. వారికి పోటీలు నిర్వహించి జట్టును ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికై న బాలబాలికలు ఈ నెల 11 నుంచి 13 వరకు ఉత్తనూర్‌, గద్వాల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ధనసరి సూర్యం, సన్‌రైసర్స్‌ హైస్కూల్‌ కరస్పాండెంట్‌ వట్టెం రాజు పీఈటీలు శ్రీకాంత్‌ మహిపాల్‌, కోచ్‌ వంశీ తదితరులు ఉన్నారు.

కేవీపీహెచ్‌ జిల్లా కమిటీ..

ములుగు రూరల్‌: కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి జిల్లా కమిటీని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్నుకున్నారు. కేవీపీహెచ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిలా అధ్యక్షుడిగా అంబాల మురళి, ప్రధాన కార్యదర్శిగా రత్నం ప్రవీణ్‌, ఉపాధ్యక్షులుగా దేవ య్య, మాణిఖ్యం, యాసం రమేశ్‌, సహాయ కా ర్యదర్శులుగా దేవేందర్‌, నరేష్‌తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

విద్యార్థినులు

అన్ని రంగాల్లో రాణించాలి

ములుగు రూరల్‌: విద్యార్థినులు అన్నిరంగాల్లో రాణించాలని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జోనల్‌ అధికారి అరుణకుమారి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. జనవరి నెలలో కాళేశ్వరం జోనల్‌ లెవల్‌ డ్రాయింగ్‌ అర్హత పోటీల్లో పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారని, వారందరికీ పతకాలు, సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ నర్మదాబాయి, డ్రాయింగ్‌ ఉపాధ్యాయురాలు స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భూ భారతి సమస్యలు  త్వరగా పరిష్కరించాలి
1
1/1

భూ భారతి సమస్యలు త్వరగా పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement