
విద్యుత్‌శాఖలో అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లకు భ
శనివారం శ్రీ 5 శ్రీ జూలై శ్రీ 2025
అన్‌మ్యాన్
డిస్ట్రిబ్యూషన్
వర్కర్లు
1,388
మంది
హన్మకొండ:
విద్యుత్‌శాఖలో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న వీరు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఆదరణకు నోచుకోవడం లేదు. వీరికి ఎలాంటి సర్వీస్ రూల్స్ లేవు. ఏదైనా ప్రమాదం జరిగినా యాజమాన్యంనుంచి అందే సహాయం కూడా లేదు. వినియోగదారులకు విద్యుత్ సంబంద సమస్యలు తలెత్తితే ముందుగా వీరినే సంప్రదిస్తారు. వీరి సమస్యలు వివరించి బాగు చేయించుకుంటారు. ఇంతటి కీలక భూమిక పోషిస్తున్న వీరికి ఆర్థిక భరోసా అందడం లేదు.
ఇటీవల బీమా సౌకర్యం..
తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తుండడంతో చలించిన టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్‌లకు బీమా సౌకర్యం కల్పించారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో మొత్తం 1,388 మంది అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరికి గత నెలనుంచి బీమా సౌకర్యం కల్పించారు. ఇప్పటి వరకు 1300మందికి బీమా సౌకర్యం కల్పించారు. ఇందులో అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను రెండు విభాగాలుగా విభజించారు. ఐటీఐ అర్హత కలిగిన వారికి నెలకు రూ.20 వేల వేతనం, ఐటీఐ అర్హత లేని వారికి నెలకు రూ.17 వేల వేతనం అందిస్తున్నారు. ఈ మేరకు ఐటీఐ అర్హత కలిగిన అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షల బీమా, ఐటీఐ అర్హత లేని వారికి రూ.17 లక్షల పరిహారం అందేలా బీమా సౌకర్యం కల్పించారు. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ ద్వారా వీరికి బీమా చేయించారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో మృతిచెందిన అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్‌కు ఈ బీమా వర్తించే అవకాశముందని విద్యుత్ అధికార వర్గాలు తెలిపాయి.
దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి రామరాజు కొన్నేళ్లుగా విద్యుత్‌శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వర్తించాడు. ఈ క్రమంలో గత మే 9న రైతుల వ్యవసాయ బావుల వద్ద ఓ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎగ్జ్‌ఫీజ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు 11 కేవీ తీగ తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఓ చెయ్యిని పూర్తిగా మరో చేయిని సగం వరకు తీసి వేశారు. రెండు నెలలుగా వరంగల్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే రూ.19 లక్షల వరకు ఖర్చు అయ్యాయి. గ్రామస్తులు దాదాపు రూ.16 లక్షల వరకు విరాళాలు అందించి చికిత్స చేయిస్తున్నారు. ఇంకా చికిత్స కోసం రూ.10 లక్షలు అవసరం అవుతాయని వైద్యులు అంటున్నారని బాధితుడి భార్య రజిత తెలిపింది. పెద్ద కుమార్తె అఖిల ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువులు ఎలా కొనసాగించాలని మదనపడుతోంది. చిన్న కుమార్తె అక్షిత ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాల్సి ఉంది. ఊరు అండగా నిలిచినా ప్రయోజనం లేకుండా పోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రజిత, పిల్లలు కన్నీటిపర్యంతమవుతున్నారు.
పోరాడి తనువు చాలించిన రమేశ్
లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన జాగిళ్లపురం రమేశ్ 2020 జూన్‌లో కొత్తపల్లిలో లైన్‌మెన్ ఆదేశాలతో ట్రాన్స్‌ఫార్మర్ తీగలను సరి చేస్తుండగా విద్యుత్ షాక్‌తో కిందపడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. డిపార్ట్‌మెంట్ నుంచి రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆస్పత్రి బిల్లులు చెల్లించారు. రమేశ్ మాత్రం కోలుకోలేదు. మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో తన తండ్రి ఉప్పలయ్య లేదా చెల్లెలు రజితకు ఎవరికైనా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని పోరాడాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు సహాయం చేస్తామన్నారే కానీ, ఎవరూ ఏమీ చేయలేదు. చివరికి లోకాయుక్తాలో కేసు వేసి పోరాడి 2024, అక్టోబర్ 3న చనిపోయాడు. కేసు ఇంకా లోకాయుక్త్తాలోనే కొనసాగుతోంది. కన్నకొడుకు చనిపోవడంతో అతడి తల్లిదండ్రులు ఉప్పలయ్య, ఆండాలు దుఖఃసాగరంలో మునిగిపోయారు.
న్యూస్‌రీల్
చేతులు కోల్పోయి రెండు నెలలుగా ఆస్పత్రిలో..
క్షేత్రస్థాయిలో కీలక విధులు..
తరచూ ప్రమాదాలు
ఇంటి పెద్ద చనిపోవడంతో
రోడ్డున పడుతున్న కుటుంబం
గాయాలపాలై మంచానికే
పరిమితమైన మరికొందరు..
మొన్నటిదాకా వినియోగదారులకు
ఇస్తున్న ఎక్స్‌గ్రేషియానే దిక్కు
ఇటీవల బీమా సౌకర్యం కల్పించిన
టీజీ ఎన్పీడీసీఎల్
ఐటీఐ అర్హత కలిగిన వర్కర్‌కు
రూ.20 లక్షలు
ఐటీఐ లేని వారికి రూ.17 లక్షల బీమా
ఆర్టిజన్లుగా గుర్తించని
టీజీ ఎన్పీడీసీఎల్
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను 2016లో విద్యుత్ సంస్థల్లోకి ఆర్టిజన్లుగా అబ్జర్వ్ చేసుకున్న క్రమంలో తెలంగాణ సౌథర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్)లో పనిచేస్తున్న కట్టర్లను (ఇక్కడ అన్‌మ్యాన్ వర్కర్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్‌లను అక్కడ కట్టర్లుగా పిలిచేవారు) ఆర్టిజన్లుగా తీసుకున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్‌లో మాత్రం అప్పటి యాజమాన్యం అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్‌లను ఆర్టిజన్‌లుగా గుర్తించలేదు. దీంతో వీరు ప్రమాదవశాత్తు మృతిచెందితే వినియోగదారులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించినట్లుగానే రూ.5లక్షలు చెల్లిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రమాదానికి గురై గాయాలపాలైతే చికిత్స ఖర్చులు మాత్రం యాజమాన్యం భరిస్తుంది. కానీ, ఇది సరిగా అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

విద్యుత్‌శాఖలో అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లకు భ

విద్యుత్‌శాఖలో అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లకు భ

విద్యుత్‌శాఖలో అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లకు భ

విద్యుత్‌శాఖలో అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లకు భ

విద్యుత్‌శాఖలో అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లకు భ

విద్యుత్‌శాఖలో అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లకు భ