
అస్తవ్యస్తం!
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని ఎండోమెంట్ ఆవరణలోని మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. మరుగుదొడ్లు, స్నానపు గదులకు మెయింటనెన్స్ చర్యలు లేకపోవడంతో అస్తవ్యస్తంగా దర్శన మిస్తున్నాయి. నీటి సరఫరా లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. మరుగుదొడ్ల తలుపు ఊడిపోయాయి. బేసిన్ల లోపల చెత్తాచెదారంతో నిండిపోయాయి. బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దర్శన సమయంలో ఒకటిరెండింటికి ఇబ్బందులు పడుతున్నారు. గద్దెలకు సుమారుగా 20 మీటర్ల దూరంలో మరుగుదొడ్లు ఉన్నా.. భక్తులకు ఫలితం లేదు. అమ్మవార్ల దర్శనం పూర్తయేంత వరకు భక్తులు కడుపు బిగపట్టుకుని బయటకు వెళ్లాల్సి వస్తుంది. దేవాదాయశాఖ అధికారులు ప్రతీ రెండేళ్లకోసారి జాతర సమయంలో మరుగుదొడ్లకు నిధులు కేటాయించి మమ అని మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారనే తప్ప శాశ్వతంగా భక్తులకు ఉపయోగ పడేలా చర్యలు తీసుకోవడం లేదు. ఈఓలు మారినా మరుగుదొడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదు. మేడారం దేవాదాయశాఖ ఉన్నతాధికారులు జాతర నిర్వహణ ఏర్పాట్ల పరిశీలనకు మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు వస్తున్న సమయంలో మాత్రమే మేడారానికి వస్తున్నారే తప్ప మిగతా రోజుల్లో దేవాదాయశాఖ తరఫున భక్తుల సౌకర్యాలపై దృష్టిసారించిన వారే లేరని భక్తులు ఆరోపిస్తున్నారు. హనుమకొండలోని ఆఫీసుకే పరిమితమై మేడారానికి చుట్టుపు చూపుగా వచ్చి పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని మిగతా పుణ్యక్షేత్రల్లోని మరుగుదొడ్లను చూసిన భక్తులు మేడారంలోని దేవాదాయశాఖ మరుగుదొడ్లను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.
కాటేజీల పరిస్థితి అంతే..
మేడారంలోని కాటేజీలు కూడా అధ్వాన స్థితిలో ఉన్నాయి. కాటేజీల గదుల్లో ఫ్యాన్లు, తాగునీటి వసతి సౌకర్యాలు కరువయ్యాయి గదులను అద్దెకు తీసుకున్న భక్తులు బయట నుంచి మినరల్ వాటర్ కొనుగోలు చేసి వంటావార్పు చేసుకుంటున్నారు. భక్తులు కాటేజీలను అద్దెకు తీసుకునేందుకు వెనుకడుతున్నారు. ప్రైవేట్ అద్దె గదులను ఆశ్రయిస్తే గదుల కిరాయి ధరలు భక్తుల జేబులను గుల్ల చేస్తున్నాయి. కాటేజీల్లో వసతులు లేవు, ప్రైవేటు అద్దె గదుల కిరాయి ధరలు మండిపోవడంతో ఆర్థిక స్థోమత లేని భక్తులు మేడారం పరిసరాల ప్రాంతంలోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుంటున్నారు. అమ్మవార్ల హుండీ కానుకల ద్వారా కొట్లాది ఆదాయం వస్తున్న దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పనలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. భక్తుల వసతుల కోసం నిధులను ఖర్చు చేయకుండా కాంట్రాక్టర్ల జేబులు నింపే పనులను చేస్తున్నారని ఆదివాసీ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
మరమ్మతు చేయాలి
మేడారం ఎండోమెంటో కార్యాలయం ఆవరణలోని మరుగుదొడ్లకు మరమ్మతు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలి. అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ఎండోమెంట్ కార్యాలయంలోని గదుల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుంటున్నారు. ఒకటిరెండింటికి ఇ బ్బందులు పడుతున్నది వాస్తమే. దేవాదాయశాఖ అధికారులు చొరవ తీసుకుని మరుగుదొడ్లను విని యోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– ఆరెం లచ్చుపటేల్,
మేడారం జాతర మాజీ చైర్మన్
అధ్వానంగా మేడారం మరుగుదొడ్లు
కాటేజీల్లో వసతులు కరువు
ఇబ్బందులు పడుతున్న భక్తులు
పట్టించుకోని దేవాదాయశాఖ అధికారులు

అస్తవ్యస్తం!

అస్తవ్యస్తం!

అస్తవ్యస్తం!