
నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి
● మున్సిపల్ కమిషనర్ సంపత్
ములుగు రూరల్: నివాస ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ ప రిధిలోని వీవర్స్‌కాలనీ, సుభాష్‌నగర్, శ్రీనివాసకా లనీ, ఆజీద్‌నగర్, తదితర ప్రాంతాలను పర్యవేక్షించారు. ఖాళీ ప్లాట్లలో నీటి నిల్వలు చేరి దోమలు వృద్ధి చెందడంతో మలేరియా, డెంగీ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. నీటి నిల్వలను గుర్తించి త గిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. అనంతరం నీటి నిల్వ ప్రాంతాల్లో బ్లీ చింగ్, ఆయిల్ బాల్స్ వేయించారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో మాజీ సీఎం రోశయ్య జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీపీఓ దేవరాజు, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.