
బ్యాంకు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు
మా నాన్నమ్మ లాలమ్మ 2023లో మరిణించింది. బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును విడిపించి ఇవ్వాలని పలుమార్లు బ్యాంకు అధికారులను కలిసి దరఖాస్తులు అందించినా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును విత్ డ్రా చేసి ఇవ్వాలని సంబంధిత పత్రాలు అందజేసినా బ్యాంక్ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ లీడ్ బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
– పూనెం రాంకుమార్, అంకన్నగూడెం, మంగపేట