
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
మంగపేట: సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. మండంలోని మల్లూరు పంచాయతీ పరిధిలోని కేసీఆర్‌కాలనీలో కలెక్టర్, జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు ఆదేశాల మేరకు చుంచుపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి యమున ఆధ్వర్యంలో శుక్రవారం మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీతో పాటు గ్రామంలోని 175 మందికి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. 25 మంది జ్వర పీడితులను గుర్తించి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధులు, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధానంగా జనావాసాల పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని, మురుగు నీరు, వర్షపునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విపిన్‌కుమార్ ఐటీడీఏ ఏటూరునాగరం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్, ఎన్‌వీబీడీసీపీ వైద్యాధికారి చంద్రకాంత్, ఎంసీహెచ్ మంగపేట వైద్యాధికారి ప్రశాంత్, నాగరాజు, తరుణ్, ఏఎన్‌ఎం సీతమ్మ, ఆశవర్కర్లు పాల్గొన్నారు.