
అందరి సహకారంతోనే..
ఈ సంవత్సరం పాఠశాలకు కొత్తగా 25 వరకు అడ్మిషన్లు వచ్చాయి. ఇందులో 16మంది అడ్మిషన్లు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు చెందినవి. ఉపాధ్యాయులందరి కృషితో ఇంగ్లిష్ మీడియంలో సమర్థవంతంగా బోధించడం ద్వారా ప్రతీ సంవత్సరం కూడా ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ అడ్మిషన్లు పొందుతున్నారు. డిజిటల్ తరగతులు, విద్యార్థులు ఇంగ్లిష్ మాట్లాడే విధంగా ప్రోత్సహించడం, గురుకుల, నవోదయ పరీక్షలకు కోచింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అభినందిస్తూ గ్రామంలోని ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారి పిల్లలను ఈ పాఠశాలలో జాయిన్ చేయడం చాలా సంతోషంగా ఉంది.
– రాజశేఖర్, ప్రధానోపాధ్యాయుడు
పిల్లలు ఇక్కడే చదువుతున్నారు..
ప్రభుత్వ పాఠశాలలోనే ఇద్దరు పిల్లలను చదివిస్తున్నా. ఇక్కడ చదవడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది. ఇంగ్లిష్ మీడియంలో మెరుగైన విద్యను బోధిస్తున్నాం. ఐఎఫ్‌పీ ప్యానల్ ద్వారా డిజిటల్ క్లాస్‌లు నడుస్తున్నాయి. ఇద్దరు పిల్లలు 3వ తరగతి చదుతోంది. తమ చిన్నారులందరినీ బడిలో చేర్పించి రూ సర్కారు బడిలో చేర్పించి విద్యను బలోపేతం చేయగలరు.
– పొడెం సమ్మయ్య,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు
●

అందరి సహకారంతోనే..