
జిల్లా ఉత్తమ ఎస్సైగా శ్రీకాంత్‌రెడ్డి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: జిల్లా ఉత్తమ ఎస్సైగా ననిగంటి శ్రీకాంత్‌రెడ్డి ఎంపికయ్యారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ శబరీశ్ చేతుల మీదుగా గురువారం రెండోసారి ఉత్తమ ప్రశంస పత్రం అందుకున్నారు. తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి సమయపాలన, విధుల పట్ల అంకితభావంతో పనిచేసిన తీరు, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఆయన చూపిన ప్రతిభను గుర్తించి ఎస్పీ ఆయనకు ప్రశంస పత్రం అందజేశారు. ఈ ఏడాది మే నెలలో సైతం ఆయన ఉత్తమ ఎస్సైగా ప్రశంసపత్రం అందుకున్నారు. తనతో పాటు, పీఎస్ సిబ్బంది, ట్రైనీ ఎస్సైలు సతీష్, మధుకర్, సిబ్బంది సమష్టిగా పని చేయడంతోనే జిల్లా ఉత్తమ ఎస్సైగా ప్రశంస పత్రం అందుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. ఎస్పీ శబరీశ్, డీఎస్పీ రవీందర్‌లకు ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.