ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం

Jun 27 2025 12:33 PM | Updated on Jun 27 2025 12:33 PM

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం

గోవిందరావుపేట: జిల్లాలో వరదలు, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు స్టేట్‌ డిసాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(ఎస్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలు సిద్ధంగా ఉన్నాయని చల్వాయిలో గల 5వ తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసిస్టెంట్‌ కమాండెంట్‌ వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం రామప్ప చెరువులో గురువారం మాక్‌డ్రిల్‌ నిర్వహించినట్లు తెలిపారు. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో హఠాత్తుగా వరదలు వచ్చి ముంపునకు గురయ్యే సమయంలో ఈ బృందాలు ప్రజలను కాపాడుతాయన్నారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టర్‌ పర్యవేక్షణలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పనిచేస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆర్‌ఐలు శోభన్‌బాబు, రాజ్‌కుమార్‌, ఆర్‌సీఐలు జీవన్‌, రఘుపతి, 70మంది సిబ్బంది పాల్గొన్నారు.

5వ బెటాలియన్‌ కమాండెంట్‌ సుబ్రహ్మణ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement