
ఇందిరాగాంధీ నియంతృత్వానికి యాభై ఏళ్లు
ములుగు రూరల్: ఇందిరా గాంధీ నియంతృత్వానికి 50 ఏళ్లు పూర్తి అయ్యాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ‘ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ దాడికి 50 ఏళ్లు’ సెమినార్‌కు నిర్వహించగా ఖమ్మం ఎంపీ తాండ్ర వినోద్‌రావు, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించి భారత ప్రజాస్వామ్యంపై దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, శ్యామ్‌ప్రసాద్, భూక్య జవహర్‌లాల్, రాజునాయక్, రవీందర్‌రెడ్డి, రమణారెడ్డి, రవిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.