
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం పలుచోట్ల ఆకాశం మేఘావృతమై మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
డిజిటల్ భూముల రీసర్వేపై అవగాహన సదస్సు
వెంకటాపురం(కె): మండల పరిధిలోని బీసీ మర్రిగూడెం పంచాయతీ కార్యాలయంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ డిజిటల్ భూముల రీ సర్వేపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్(రెవెన్యూ) మహేందర్ జీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మండల పరిధిలోని డిజిటల్ భూ సర్వేకు పైలట్ ప్రాజెక్టుగా నూగూరు(జీ) గ్రామం ఎంపికై ందని తెలిపారు. అనంతరం రైతులకు డిజిటల్ భూముల రీ సర్వే వివరాలపై అవగాహన కల్పించారు. పలువురు రైతుల అనుమానాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రూ.300 కూలి వచ్చేలా
పని చేయించాలి
● ఏపీఓ రాజు
వాజేడు: ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీలకు రోజుకు రూ.300 కూలి వచ్చేలా పనులు చేయించాలని ఏపీఓ రాజు కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధి కూలీలు క్షేత్ర స్థాయిలో రూ.300 సరిపోను పని చేయకపోవడం వల్లే డబ్బులు తక్కువగా వస్తున్నాయని తెలిపారు. కూలీలకు ఈ విషయం వివరించి డబ్బులు ఎక్కువ వచ్చేలా పనులను చేయించాలన్నారు. అందుకు తగిన విధంగా మార్క్ చేయాలని సూచించారు. ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ విజయ తదితరులు ఉన్నారు.
‘కేశవరావుది
బూటకపు ఎన్‌కౌంటర్’
భూపాలపల్లి అర్బన్: మావోయిస్టు నేత నంబాల కేశవరావుది బూటకపు ఎన్‌కౌంటర్ అని.. పట్టుకొని కాల్చి చంపారని ఎమ్మెల్సీ కోందడరాం మండిపడ్డారు. జిల్లాకేంద్రంలోని ఓ వివాహానికి కోదండరాం గురువారం హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ అనేక మందిని ఇలాగే ఎన్‌కౌంటర్ చేసి చంపారన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు. ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు.

వాతావరణం